పుష్ప 1 సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డ్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప రాజ్ అభినయానికి ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా పుష్ప 2 లో అంతకుమించి అదరగొట్టేలా తన పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 ఆల్రెడీ సగానికి పైగా పూర్తి కాగా సినిమాపై ఇంకాస్త ఫోకస్ ఎక్కువ పెట్టి ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకూడదని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.పుష్ప తర్వాత ఆల్రెడీ సందీప్ వంగాతో సినిమా అనౌన్స్ చేశాడు. కానీ దాని కన్నా ముందు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. జులాయితో మొదలైన వీరి కాంబో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అల వైకుంఠపురములో అయితే నాన్ బాహుబలి రికార్డులను తిరగ రాసి అదరగొట్టేసింది.అల వైకుంఠపురములో లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి చేసే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా త్రివిక్రమ్ కథ రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమా త్రివిక్రం కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక ప్రయోగాత్మక సినిమాగా ఉంటుందట. సినిమా ఒక పీరియాడికల్ డ్రామాగా ఫాంటసీ మూవీగా ప్లాన్ చేస్తున్నారట. ఎప్పుడు తన సినిమాల్లో కథ గురించి పెద్దగా ఆలోచించని త్రివిక్రమ్ తన డైలాగ్స్ తోనే హిట్ కొట్టేస్తాడు.

అల్లు అర్జున్ తో చేసే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ కూడా భారీ స్కేల్ సినిమాలు చేయడం మొదలు పెడితే తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి తన స్టామినా చూపించడం పక్కా అని చెప్పొచ్చు.ఇదంతా బాగానే ఉన్నా.. బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. మిగతా బడా హీరోలంతా వరుస సినిమాలు లైన్ లో పెడుతుంటే.. అల్లు అర్జున్ కొత్త చిత్రాల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బోలెడు రూమర్స్ వస్తున్నా.. అఫీషియల్ గా ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. దీంతో అల్లు అర్జున్.. పుష్ప-2 తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారన్నది బిగ్ సస్పెన్స్ గా మారింది.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. అందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఫిక్స్ అయిందని.. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు తూచ్ అని చెబుతున్నారు.ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాలుగో సినిమా కోసం వర్క్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఆ మూవీ.. మైథలాజికల్ టచ్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: