అయితే టాప్ హీరోల సినిమాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ గత కొన్ని వారాలుగా కొన్ని చిన్న సినిమాలు ఆసినిమాల నిర్మాతలకు బయ్యర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. గత రెండు నెలల వ్యవధిలో విడుదలైన కొన్ని చిన్న సినిమాలు సాధించిన ఘన విజయం హాట్ టాపిక్ గా మారింది. ఆ లిస్టులో మొదటిగా చెప్పుకోవలసింది మెగా డాటర్ నీహారిక తీసిన ‘కమిటీ కుర్రోళ్లు’ అందరూ కొత్త వాళ్ళతో నీహారిక చేసిన ఈప్రయోగం ఆంధ్రప్రదేశ్ లో చాలామంది అభిమానం పొందగలిగింది.
అతి తక్కువ పెట్టుబడితో నీహారిక చేసిన ఈప్రయోగం సక్సస్ కావడంతో మళ్ళీ చిన్న సినిమాల రోజులు మొదలయ్యాయా అని అనిపిస్తోంది. యదు వంశీని అనే కొత్త దర్శకుడు తీసిన ‘కమిటీ కుర్రాళ్ళు’ మూవీ సక్సస్ కావడంతో నీహారిక మంచి జోష్ లో ఉంది. ఇక ఈ లిస్టులో రెండవ సినిమా ‘ఆయ్’ రవితేజ రామ్ విక్రమ్ లాంటి టాప్ హీరోల సినిమాలను తట్టుకుని ‘ఆయ్’ విజయం సాధించడంతో సినిమా బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా తెలుగు ప్రేక్షకులకు లేదు అన్న విషయం మరొకసారి ఋజువైంది.
రానా తన సొంత బ్యానర్ పై తీసిన ‘35’ చిన్న కథ కాదు మూవీ కలక్షన్స్ పరంగానే కాదు విమర్శకుల నుండి ప్రశంసలు వస్తు ఉండటంతో గ్లామర్ హీరోయిన్స్ పాటలు లేకపోయినా సినిమా కథ విషయంలో వెరైటీ పాయింట్ ఉంటే ఆసినిమాను ప్రేక్షకులు అదరిస్తారు అన్న విషయం మరొకసారి రుజువైంది..