అదితి రావు హైదరి , సిద్ధార్థ్ ప్రేమ కథ విషయానికి వెళ్తే 2021లో నటించిన మహాసముద్రం సినిమా నుంచి వీరి మధ్య ప్రేమాయణం మొదలయ్యిందట. అప్పటి నుంచి ఈ జంట అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఒకరినొకరు ప్రమోషన్స్ చేసుకుంటూ ఉండేవారు. మొదట ఈ జంట తమ ప్రేమ గురించి చెప్పకపోయినా చివరికి ఊహాగానాలనే నిజం చేశారు ఈ జంట. సిద్ధార్థ్ 2023లో 44వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు అదితీతో ఉన్న ఎఫైర్ గురించి మరింత బలాన్ని చేకూర్చాయి. అదే ఏడాది అదితి 37వ పుట్టినరోజు జరుపుకున్నది.
సిద్ధార్థ్ - అదితి మధ్య ఏజ్ గ్యాప్ 8ది సంవత్సరాలు ఉన్నదట. ఇద్దరు కూడా తమకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా సిద్ధార్థ్ తనకి ఎలా ప్రపోజ్ చేశారనే విధంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.. ఒక ఏడాది పాటు ఇద్దరి మధ్య బాగానే సన్నిహిత్యం ఉండేదని చివరికి సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేసిన స్థలం తన అమ్మమ్మ స్థలం అన్నట్టుగా తెలియజేసింది అదితి. తన చిన్ననాటి స్థలంలో అలా ప్రపోజ్ చేయడంతో వెంటనే పడిపోయారని తెలియజేసింది..ఆ తర్వాతే సడన్గా ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని తెలిపింది. నిన్నటి రోజున ఈ జంట ఒక్కటయ్యారు