కొద్దిరోజుల క్రితం ఆమెను బెంగళూరు డ్రగ్ కేసులో నిందితురాలుగా నమోదు చేశారు పోలీసులు. బెంగళూరులోని రేవు పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ వాడినట్లు పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. విచారణకు రావాలంటూ కోర్టు పోలీసులు ఆదేశిస్తే ఆమె మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని నానా యాగీ చేసి విచారణను ఎగ్గొట్టింది. బెంగళూరులో రేవ్ పార్టీ జరిగినప్పుడు తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నానని ఆమె తెలిపింది. అందుకు ఫ్రూఫ్ గా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసింది వాటిలో ఆమె పచ్చళ్ళు లేదా ఏదో వంటకం చేస్తూ కనిపించింది. కానీ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కొద్దిరోజుల్లో జైల్లో వేశారు. దీంతో మా అసోసియేషన్ ఆమె మెంబర్‌షిప్‌ను రద్దు చేసింది. మళ్లీ ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదని టెస్టులు చేయించుకుని నిరూపించాక మా అసోసియేషన్ ఆమెపై బ్యాన్ ను ఎత్తేసింది.
అయితే హేమ చూపించిన ఆధారాలు, సర్టిఫికెట్లు అన్నీ అబద్ధాలు అని ఆమె డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవమే అని పోలీసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. ఆమెపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. దీంతో నోటి దూల ఎక్కువగా ఉన్న హేమ మరింత రెచ్చిపోయింది. కానీ ఇప్పటిదాకా చార్జి షీట్ ను చూడలేదని అప్పుడే మీడియా వారికి అది ఎలా అందిందని ఆమె ఫైర్ అయ్యింది. మీడియాలో తన గురించి వస్తున్న తప్పుడు వార్తలను చూసి తన తల్లి అనారోగ్యం పాలయ్యిందని కూడా ఆమె వాపోయింది. తనకు ఎవరూ డ్రగ్ టెస్టులు చేసిన అతనికి నో ప్రాబ్లం అని కూడా తెలిపింది. అంతేకాకుండా పరువు పోతే తాను ప్రాణాలు తీసుకోవడానికి అయినా సిద్ధమే అని పేర్కొంది.