రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి. ఈ సంవత్సరం లోపు ఎలాగైనా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టబోతున్నాడు చరణ్. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని సంగీత దర్శకుడు AR రహమాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఇదిలావుండగా ఇప్పటికే పూజ కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం మేకోవర్‌ అవుతున్న చెర్రి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శివోహంతో ఫోటో షేర్‌ చేశాడు.
ఈ ఫోటోకి "బీస్ట్‌ మోడ్‌ ఆన్‌ అంటూ ఆర్‌సీ 16 లోడింగ్‌" అంటూ ఫోటో షేర్‌ చేశాడు. ఆర్‌సీ 16 కోసం ప్రముఖ సెలబ్రిటీ ట్రైయినర్‌  శివోహం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నట్టు చరణ్‌ పేర్కొన్నాడు. ఇందులో చరణ్‌ లుక్‌ చాలా పవర్ఫుల్‌గా కనిపించబోతున్నాడట. పాత్రకు తగ్గట్టు తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ చేసుకునే పని పడ్డాడు చరణ్‌. ఇందుకు ప్రత్యేకంగా ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీ ట్రెయినర్‌ శివోహం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జిమ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శిక్షణ తీసుకుంటున్న ఫొటో షేర్‌ చేశాడు. ఇందులో చరణ్‌ జిమ్‌ వేర్‌లో కనిపించాడు.దీనికి బీస్ట్‌ మోడ్‌ ఆన్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చి సాలీడ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. ఆర్‌సీ 16 కోసం ప్రత్యేకంగా మేకోవర్‌ అవుతుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. చరణ్‌ బీస్ట్‌ లుక్‌లో ఇమాజిన్‌ చేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. కాగా RC16లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో మిగతా తారాగణంపై త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ రానున్నాయి. ఇక వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: