టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో సంయుక్త మీనన్ ఒకరు. ఈమె బీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో వరుస అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన బింబిసార , సార్ , విరూపాక్ష మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా ఈమె డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ నటి చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. 

ఈమె ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ఓ మూవీ లోనూ , శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఓ మూవీలోనూ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు మూవీలోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి ఉల్లి పొరలాంటి పలుచటి శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ద్వారా కూడా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sm