ప్రభాస్ : ఇప్పటి వరకు ఈయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రభాస్ హీరోగా రూపొందిన 6 సినిమాలు ఇప్పటివరకు 100 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేశాయి. 100 కోట్ల కలెక్షన్లను ఎక్కువగా సార్లు రాబట్టిన హీరోల లిస్టులో తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈయన మొదటి స్థానంలో ఉన్నాడు.
మహేష్ బాబు : ఈయన హీరోగా రూపొందిన ఐదు సినిమాలు 100 కోట్ల షేర్ కలక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. 100 కోట్ల కలెక్షన్లను ఎక్కువగా సార్లు రాబట్టిన హీరోల లిస్టులో తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈయన 2 వ స్థానంలో ఉన్నాడు.
చిరంజీవి : చిరంజీవి హీరోగా రూపొందిన మూడు సినిమాలు 100 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టాయి. 100 కోట్ల కలెక్షన్లను ఎక్కువగా సార్లు రాబట్టిన హీరోల లిస్టులో తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈయన 3 వ స్థానంలో ఉన్నాడు.
రామ్ చరణ్ , అల్లు అర్జున్ రెండు సినిమాలతో ఇప్పటివరకు రెండు సార్లు 100 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక సారి 100 కోట్ల కలెక్షన్లను అందుకున్నాడు.
తేజ సజ్జ : హనుమాన్ మూవీ తో ఒక సారి 100 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించాడు.