ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 19 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన గిల్లి మూవీ కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా 32.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి మూవీ ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన రి రిలీజ్ అయింది. ఈ మూవీ కి రీ రిలీస్ లో బాగంగా 8.90 కోట్లకు కలెక్షన్లు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 వ తేదీన రి రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి మూవీ ని కొంత కాలం క్రితం రీ రిలీస్ చేయగా ఈ సినిమాకు 7.46 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన బిజినెస్ మాన్ మూవీ ని కొంత కాలం క్రితం రీ రిలీస్ చేయగా ఈ మూవీ కి 5.85 కోట్ల కనెక్షన్లు వచ్చాయి.


దేవా దూతన్ అనే మలయాళ సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేయగా ఈ సినిమాకు 5.3 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. స్పదికం అనే మలయాళ సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేయగా ఈ సినిమాకు 4.90 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సింహాద్రి మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 4.60 కోట్ల కనెక్షన్లు దక్కగా , ఈ నగరానికి ఏమైంది మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 3.52 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 3.40 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రీ రిలీజ్ అయిన సినిమాలలో టాప్ 10 లో ఆరు తెలుగు సినిమాలే ఉన్నప్పటికీ మొదటి స్థానంలో మాత్రం తెలుగు సినిమా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: