ఎన్నో విషయాలలో హీరోలు సైతం చొరవ తీసుకొని మరి తమ అభిమానులకు సమాజంలో ఎలా ఉండాలనేలా ఆదర్శంగా నిలిచేలా ప్రయత్నాలు చేయాలనే విషయం పైన తెలియజేస్తూ ఉంటారు. కానీ కాస్టింగ్ కౌచ్ అనే విషయానికి వస్తే మాత్రం ఎవరూ కూడా ముందుకు రారు. వెనుకడుగు వేస్తూనే ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హేమ కమిటీ రిపోర్ట్ ల తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన తెలుగు సినీ పరిశ్రమ నుంచి హీరోలు ఎవరు కూడా స్పందించలేదు.


కేరళ సినీ పరిశ్రమ కాస్టింగ్ కౌచ్ సమస్య అక్కడే మొదలయ్యిందట.. అక్కడ సీనియర్ నటుల పైన కొంతమంది పైన కేసులు కూడా వేయడం జరిగింది. ఈ కాస్టింగ్  కౌచ్ పైన ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి మరి పరిశీలిస్తున్నారు. కోలీవుడ్లో ఈ ఇష్యూ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. నడిగర్ సంఘం ప్రత్యేకంగా సమావేశమై బాధితులకు అండగా ఉంటామంటూ ఇటీవల ప్రకటించింది. స్వయంగా విశాల్, కార్తి వంటి హీరోలు ఈ క్యాస్టింగ్ కౌచ్ పైన మాట్లాడటం జరిగింది. విశాల్ ఏకంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ఖచ్చితంగా మహిళలు ధైర్యంగా వచ్చి ముందుకి చెప్పవచ్చునీ ..ఫిర్యాదుల పైన తక్షణమే చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు.

తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే హీరోలు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదంటూ కూడా గతంలో ఒక పెద్ద హీరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక పెద్ద అబద్ధం అంటూ చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు. ఈ విషయం మీద కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్స్ సైతం ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోలు మాత్రం ఈ విషయం పైన స్పందించడానికి ముందుకు రావడం లేదు. మహిళలకు మద్దతుగా కూడా ఏ ఒక్క హీరో కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: