కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా మంచి జోష్ లోనే తన కెరియర్ను ముందుకు సాగించాడు. ఒక దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలి అని ఒక కథను రాసుకుంటే , అది చివరకు రాజశేఖర్ తో తెరకెక్కించారట. అసలు ఆ సినిమా ఏది ..? చిరంజీవి తో అనుకుంటే రాజశేఖర్ తో ఎందుకు చేశారు అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ను కొనసాగించిన వారిలో రాఘవేందర్రావు ఒకరు. రాఘవేంద్రరావు చిరంజీవి తో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు. అందులో భాగంగా చిరంజీవి తో ఒక సినిమా చేయాలి అని అనుకున్నాడట. ఇక అప్పటికే చిరంజీవి కి మాస్ ఈమేజ్ ఉండడంతో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చిరంజీవితో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఒక కథను రాసుకున్నాడట. అది చిరంజీవి కి వినిపించగా చిరు కు కూడా అది అద్భుతంగా నచ్చిందట. ఇక అంతా ముందుకు సాగుతుండగా అనుకోకుండా ఆ కథను రాజశేఖర్ విన్నాడట.


ఇక దానితో రాఘవేంద్రరావు తో రాజశేఖర్సినిమా నాతో చేయండి బాగుంటుంది అని అన్నాడట. దానితో ఇది చిరు టి చేయాలి అనుకున్నాను. ఆయనకు కథ చెప్పాను. సినిమా చేయడానికి ఆల్రెడీ ఓకే చెప్పాడు. ఆయననే మీరు అడగండి అన్నాడట. దానితో రాజశేఖర్ , చిరు ను అడగడం. చిరు కూడా ఓకే అనడంతో రాఘవేంద్రరావు రాజశేఖర్ తో అందరి ప్రియుడు అనే టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని రూపొందించడం , అది బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం జరిగిందట. అలా చిరంజీవి కోసం రాసుకున్న కథను రాఘవేంద్రరావు రాజశేఖర్ తో తీసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: