అన్నింటికీ మించి ఫ్రెండ్షిప్ పేరుతో తనను మోసం చేశాడని.. తన హార్ట్ బ్రేక్ చేశాడంటూ కూడా చెప్పుకు రావడం విశేషం. అయితే హౌస్ లో ఫ్రెండ్ షిప్, గేమ్ రూల్స్ వేరు వేరుగా ఉంటాయని.. రెండింటిని కలిపి చూడొద్దంటూ నామినేషన్స్లో మణికంఠ చెప్పినప్పటికీ యష్మి అతడి మాటలను పట్టించుకోలేదు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో యష్మితో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేసేందుకు మణికంఠ ట్రై చేస్తున్నట్టు కనబడింది. యష్మి అద్దం ముందు హ్యాండ్ వాష్ చేస్తుండగా.. వెనక నుంచి హగ్ చేసుకున్నాడు.
ఇక ఇక్కడే మనోడికి ఝలక్కించింది యష్మి. యష్మి కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ వదిలేయాలని చెప్పడం ఈ ప్రోమో వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతోంది. దీంతో యష్మిని వదిలేసి మణికంఠ వెళ్లిపోతాడు. నాకు చాలా బాధగా ఉంది బిగ్ బాస్! అంటూ కూడా ఆమె బెడ్ పై కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సోఫాలో పృథ్వీతో మాట్లాడుతూ.. నాకు మెంటల్ టార్చర్ అది.. అతడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్ గా లేదు.. నేను ఉన్న రోజులు అతడిని నామినేట్ చేస్తుంటాను! అంటూ చెప్పుకొచ్చింది కూడా. దాంతో మణికంఠ ఆమెని ఫిజికల్ గా ఇబ్బంది పెడుతున్నాడు అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.