మంచు విష్ణు ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మంచు విష్ణు లక్కున్నోడు, విష్ణు, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక బ్లాక్ బస్టర్ విజయాలని కూడా అందుకుంది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు పూర్తి ఫోకస్ ను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాపై పెట్టాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే ప్రయత్నంలో దీనిని ప్రతిష్టాత్మకంగా తరికెక్కిస్తున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని మోహన్ బాబు ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, దేవరాజ్, అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే పలు పోస్టుర్లు విడుదలై కన్నప్ప సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాయి.అయితే డిసెంబర్లో ఈ మూవీ విడుదల కాబోతుంది.

ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ మొదలెట్టి ప్రతి సోమవారం కన్నప్పకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో..తాజాగా, మంచు విష్ణు స్పెషల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. కన్నప్పలో మంచు విష్ణు క్యారెక్టర్ కోసం ఉపయోగించిన గుర్రం ఫోటో షేర్ చేస్తూ.." టిక్కిని కలవండి. కన్నప్పలో తానే నా సోదరుడు, నా బెస్ట్ ఫ్రెండ్. నిజ జీవితంలో తాను ఒక అద్భుతమైన గుర్రం. మునుపెన్నడూ చెయని స్టంట్స్ ను నాతో చేయించింది" అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రజెంట్ మంచు విష్ణు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... దీనిపై నటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: