జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ రూపొందింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ కు పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం వారు వరుసగా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు.

ఎక్కువ శాతం ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ హిందీ లో ప్రచారాలను నిర్వహించింది. మరికొన్ని రోజుల్లోనే తమిళ్ లో కూడా భారీ ఎత్తున ప్రచారాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం వారు సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ విడుదల ఉండడంతో ఈ నెల 21 వ తేదీన లేదా 22 వ తేదీన భారీ ఎత్తున హైదరాబాద్ లో ఓ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బృందం కూడా ఆ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన భారీ ఎత్తున హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అని అనుకున్నట్లు తెలుస్తోంది.

కానీ దానికి పోలీసుల నుండి అనుమతి రావట్లేదు అని సమాచారం. దానితో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రెండు తేదీల్లో ఉంటుందా ... లేదా అనేది అనుమానంగా మారింది. ఉన్న హైదరాబాదులో ఉంటుందా లేక వేరే ఏదైనా ప్రాంతంలో ఉంటుందా అనేది కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. మరి దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ ఎత్తున నిర్వహిస్తే బాగుంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. మరి దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఏ  రేంజ్ లో నిర్వహిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: