జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా దాడి చేసి గాయపరిచారు అంటూ జానీ మాస్టర్ అసిస్టెంట్ గా పని చేసిన ఒక లేడీ డాన్సర్ ఇటీవల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనగా మారిపోయింది. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా తీవ్ర వేధింపులకు గురి చేసేదని.. కోరిక తీర్చకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు చేసింది సదరు లేడీ డాన్సర్. దీంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంది అని చెప్పాలి.
అయితే ఇప్పటికే ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జానీ మాస్టర్ ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇలా అత్యాచారం కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ షాప్ ఇచ్చింది. ఈ విషయంపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కి కూడా ఫిర్యాదు అందినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని వేధింపుల పరిష్కార ప్యానల్ కు సిఫారసు చేసినట్లు పేర్కొంది. బాధిత పార్టీల ప్రైవసీని రక్షించాలని మీడియాను అభ్యర్థించింది. దీనిపై పి ఓ ఎస్ హెచ్ చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుంది అంటూ స్పష్టం చేశారు.