కాగా గత కొంతకాలం నుంచి అటు సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాలలో పుష్ప 2 సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప కి ఇది సీక్వెల్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలుగు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్ 9వ తేదీన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. కాగా పుష్ప మూవీ కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ పుష్ప 2 మూవీ కంటే ఎక్కువగా మరో మూవీ కోసం ఇప్పుడు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారట.
ఆ సినిమా ఏదో కాదు దేవర కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ.. ఈనెల 27వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే బుక్ మై షో లో ఇంట్రెస్ట్ ల విషయంలో పుష్ప 2నూ దేవర సినిమా దాటేసింది. పుష్ప 2 చూసేందుకు 334.6k మంది ఆసక్తి చూపిస్తుండగా.. దేవర పార్ట్ వన్ చూడటానికి ఆసక్తిగా ఉన్న వారి సంఖ్య 341.3k కి పెరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా.. దేవర ఈనెల 27న రిలీజ్ అయితే.. పుష్ప డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. అప్పటివరకు పుష్ప చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపే వారి సంఖ్య పెరుగుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.