తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ -8 వ సీజన్ ఇప్పుడు కొనసాగుతోంది. గత సీజన్లో కంటే ఈసారి ఆకట్టుకునే ఇలా  లేకపోయినప్పటికీ కూడా తన ఆట తీరుతో మాట తీరుతో బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కంటెస్టెంట్స్ ఎవరూ కూడా పెద్దగా తెలిసిన వాళ్లు లేరు..సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ బిగ్ బాస్ కొత్త సీజన్ ఇప్పటికే రెండు వారాలు కంప్లీట్ చేసుకుంది.. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటికీ ఇందులో బేబక్క ,శేఖర్ భాష కంటేస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే శేఖర్ భాష తనకు కొడుకు జన్మించారని ఆనందంతో హౌస్ నుంచి బయటికి వచ్చినట్లు వార్తలు వినిపించాయి.ప్రస్తుతమైతే 12 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు.


ఇదంతా ఇలా ఉండగా ఈసారి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన ప్రేరణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రేరణ భర్త యొక్క అమ్మమ్మ తాజాగా మరణించినట్టు తెలుస్తోంది. అయితే ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కాబట్టి ఈ విషయం తెలిసే అవకాశం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంగళవారం జరిగే ఎపిసోడ్ లో స్వయంగా ప్రేరణకు ఈ విషయాన్ని బిగ్ బాస్ చెప్పబోతున్నట్లు సమాచారం.. మరి ఈ విషయం తెలిస్తే ప్రేరణ ఎలా రియాక్ట్ అవుతుందనే విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు.

మరి బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపిస్తారా లేదా అనే విషయం ఇప్పుడు అభిమానులలో  సందేహాన్ని ప్రేరణ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత హౌస్ లో కంటిన్యూ కొనసాగిస్తుందా లేదా అనే విషయం చూడాలి.. ప్రస్తుతం కంటెస్టెంట్స్ గా ప్రేరణ తన ఆటతీరుతో బాగానే మేప్పిస్తోంది. ఒకవేళ ప్రేరణ హౌస్ నుంచి బయటికి వస్తే మాత్రం ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: