ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ఒకే సినిమా గురించి చర్చించుకుంటున్నారు. అదే పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రబృందం మొత్తం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు దేవర ప్రమోషన్స్ కి సంబంధించిన వీడియోలే దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే చాలా గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మూవీ కావడంతో అటు అభిమానులకి కూడా ఎంతో  ఆతృతగా  ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ మూవీకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారిపోతున్నాయ్. అయితే ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన ఒక వార్త మాత్రం తారక్ అభిమానులు అందరిని కూడా షాక్ కు గురిచేస్తుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ ఒక ఫ్లాప్ సినిమాకు కాపీ అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.


 గోపీచంద్ హీరోగా నటించిన డిజాస్టర్ మూవీ కి దేవర కాపీ సినిమా అంటూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది  శ్రీకాంత్, పెద్ద ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్. శ్రీకాంత్ కూతురు జాన్వి, చిన్న ఎన్టీఆర్ లవర్స్. శ్రీకాంత్, పెద్ద ఎన్టీఆర్ ఇద్దరు కలిసి స్మగ్లింగ్ చేస్తారు. ఒకానొక టైంలో పెద్ద ఎన్టీఆర్ స్మగ్లింగ్ మానేద్దాం అని చెప్తాడు. శ్రీకాంత్ కు అది నచ్చక సైఫ్ అలీ ఖాన్ తో చేతులు కలిపి పెద్ద ఎన్టీఆర్కు అనుమానం రాకుండా ఒక్కొక్కరిని చంపుతూ వెళ్తాడు. ఇక పెద్ద ఎన్టీఆర్ ను చంపేయడం అనేది ఇంటర్వెల్ ట్విస్ట్. సెకండాఫ్ లో చిన్న ఎన్టీఆర్ రివెంజ్ తీర్చుకుంటారు. అది కూడా దేవుడు పూనడంతో  ఎన్టీఆర్ తన తండ్రి చావుకు రివెంత్ తీసుకుంటాడు అనేది దేవరా స్టోరీ అంటూ ఒక టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే ఇది గోపీచంద్ నటించిన బీమా మూవీ కథకు ఎంతో దగ్గరగా ఉంది. భీమ మూవీలోను గోపీచంద్ డ్యూయల్ రోల్ చేశాడు. ఒక పాత్ర చనిపోతే రెండవ పాత్ర చివర్లో దేవుడు అవుతారంలో విలన్ ను చంపేస్తుంది. దీంతో గోపీచంద్ డిజాస్టర్ మూవీకి దేవర కాపీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: