జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన 'దేవర' చిత్రం ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా పలు రికార్డులు సృష్టిస్తోంది. బుక్ మై షోలో 'పుష్ప 2'ను దాటేసింది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు స్టార్ గా వెలిగిన సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. ఆయన తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో సుమన్ హీరో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సుమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు. దేవర విడుదలకు ముందే ఇన్ని రికార్డులు అంటే సామాన్యం కాదు. అది అందరు నటులకు సాధ్యం కాదు. దర్శకుడు కొరటాల శివతో పాటు దేవర మూవీ టీమ్ వలన కూడా ఇది సాకారం అయ్యింది. దేవరకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ బాల్యం నుండే క్లాసికల్ డాన్సర్. అందుకే ఆయన ఏ డాన్స్ వేసినా గ్రేస్ ఉంటుంది. అలాగే డైలాగ్స్ చెప్పడంలో చిన్నప్పటి నుండే అలవాటు ఉంది. అందులో ఆయన మాస్టర్. డాన్సుసుల పై కూడా పట్టు ఉంది. సిల్వర్ స్క్రీన్ పై నటులు ఎలా కనిపించాలో ఎన్టీఆర్ కి అవగాహన ఉంది.అంకితభావం, నిబద్ధత కలిగిన నటుడు. సెట్స్ లో అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. ప్రతి సన్నివేశాన్ని టీం తో చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. ఆయనతో మరోసారి కలిసి నటించాలని కోరుకుంటున్నాను. దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.. అని అన్నారు.ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించారు. జాన్వీ కపూర్, చైత్ర రాయ్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, మురళి శర్మ కీలక పాత్రలు పోషించారు.నా అల్లుడు మూవీలో సుమన్ ఎన్టీఆర్ కి మేనమామ పాత్ర చేశాడు. అలాగే దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేశారు. అవకాశం వస్తే ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు సిద్ధమని సుమన్ తన మనసులో కోరిక బయటపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: