ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతల హవా నడిపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించి ఇక అన్ని భాషల్లో కూడా తమ మార్కెట్ ను పెంచుకున్నారు. టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ స్టార్ హీరోలకు గ్లోబల్ లెవెల్ లో ఒక్కో సినిమాకి 300 నుంచి 400 కోట్ల బిజినెస్ ఎంతో అలవోకగా జరిగిపోతుంది. ఒకవేళ హిట్ టాక్ వచ్చింది అంటే 500 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధిస్తూ ఉన్నాయి. ఆయా హీరోల సినిమాలు అయితే ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోల జాబితాలో కూడా మీరు నలుగురు టాప్ లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బాహుబలి 2 తర్వాత ఐదు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రభాస్ మరో ఐదు ప్రాజెక్ట్స్ లైన్ అప్ లో కూడా ఉన్నాయి. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత ఇక రెండో పాన్ ఇండియా మూవీగా.. దేవరతో ఈనెల 27వ తేదీన తారక్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.


 అయితే ఈ సినిమా ముందు చాలా టార్గెట్స్ తారక్ కి ఉన్నాయి అని చెప్పాలి. ఇందులో 150 ప్లస్ కోట్ల షేర్ ఒకటి. ఇప్పటివరకు కేవలం ప్రభాస్ మాత్రమే ఆరుసార్లు 150 ప్లస్ కోట్ల షేర్ ని అందుకున్నారు. అల్లు అర్జున్ రెండుసార్లు ఈ రికార్డును అందుకున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి త్రిబుల్ ఆర్ సినిమాతో 150 ప్లస్ కోట్ల షేర్ సాధించారు. ఇప్పుడు సోలోగా దేవరా ఈ రికార్డును అందుకున్నందుకు సిద్ధమయ్యాడు. ఇంకోవైపు 200 కోట్లు షేర్ ప్రభాస్ అయిదు సార్లు అందుకోగా.. రామ్ చరణ్,, తారక్ కలిసి త్రిబుల్ ఆర్ తో ఒకసారి సాధించారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ సోలాగా ఇది సాధిస్తాడా లేదా అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: