టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే వారు నటించిన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ దక్కించుకుంటారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ సమంత ఒకరు. సమంత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన సమంత ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది.



ఈ మధ్యకాలంలో సమంత తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. ఇతర భాషలలో సినిమాలు చేయడానికి సమంత ఆసక్తిని చూపిస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా.... సమంత గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకానొక సమయంలో సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఓ స్టార్ హీరోనే గురువు అని తెలియజేసింది.



త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.... ఈ సినిమా సమయంలో పవన్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని తెలియజేసింది. షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో సమంతను పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తూ కనిపించారు.



అయితే అంశం పై సమంత మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నా మొదటి గురువు అని పేర్కొంది సమంత. స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సరదాగా తీసిన ఫోటో అది. పవన్ కళ్యాణ్ నటుడు కాకపోయి ఉంటే నాకు గురువుగా ఉండమని కోరేదాన్ని అంటూ సమంత పేర్కొంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా తిట్టాలంటే కూడా చాలా మర్యాదగా తిట్టేవారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: