మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది.అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు.దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో 'దేవర పార్ట్ 1'లోని సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్‌గా ముంబైలో గ్రాండ్ లెవల్లో ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్నీ భాషల్లో కలిపి మిలియన్స్ వ్యూస్‌తో ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిఫరెంట్ ప్లానింగ్‌తో సాగుతోన్న ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి.వరల్డ్ వైడ్ ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ నుంచి ఎన్టీఆర్ క్యారెక్టర్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. సోమవారం తండ్రి క్యారెక్టర్ లో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో తారక్ పెద్ద కత్తి పట్టుకొని ఉన్నారు. ఈ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

తాజాగా కొడుకు క్యారెక్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. సైన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటూ క్యాప్షన్ మెన్షన్ చేసి పోస్టర్ ని వదిలారు. ఇందులో వెనక్కి తిరిగి ఉన్న తారక్ చేతిలో కట్టిపట్టుకొని సీరియల్ గా చూస్తున్నాడు. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ చాలా వైబ్రెంట్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. 'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఆ లోపు సినిమాకి వీలైనంత హైప్ తీసుకొచ్చే పనిలో చిత్ర యూనిట్ ఉంది.అందుకే పోస్టర్ స్టిల్స్ ని డైలీ వదులుతున్నారు. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు మూవీ సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఈ ట్రైలర్ ని కంప్లీట్ యాక్షన్ ఎలివేషన్స్ షాట్స్ తో కట్ చేశారనే మాట వినిపిస్తోంది. మొత్తమీద 'దేవర' టీమ్ వరుసగా పోస్టర్స్ తోనే సినిమాపై హైప్ పెంచుతూ కావాల్సినంత కిక్ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఇదిలా ఉంటే సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేస్తారా మిగిలిన క్యాస్టింగ్ కి సంబందించిన లుక్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వదులుతారా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ అన్ని పాత్రలకి సంబందించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తే రిలీజ్ వరకు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: