అయితే ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ రావడంతో ఈ రెండు సినిమాలను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు నష్టాలు వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాని పారితోషికం 25 కోట్ల రేంజ్ లో ఉంటోంది అని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘సరిపోదా శనివారం’ నెట్ కలక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో 30 కోట్లు మించి ఉండదు అని అంచనా.
ప్రస్తుతానికి నానితో సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య అనేకమంది ఉండటంతో నాని కెరియర్ కు సమస్య లేకపోయినప్పటికీ మాస హీరోగా మారాలి అని నాని చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడటంతో ఇప్పట్లో నాని టాప్ యంగ్ హీరోల లిస్టులో చేరే అవకాశాలు కొంచం మాత్రమే కనిపిస్తున్నాయి అన్న అంచనాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పట్టణాలలో అదేవిధంగా ఓవర్సీస్ లో నాని క్రేజ్ కు ఎటువంటి సమస్యా లేకపోయినప్పటికీ మాస్ ప్రేక్షకులు సినిమాలు బాగా చూసే బిసి సెంటర్లలో నాని సినిమాలకు అంత స్పందన ఉండటంలేదు అన్న అంచనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని చేస్తూనే శేఖర్ కమ్మల దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి నాని ఓకె చేశాడు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కుబేరా’ మూవీని చేస్తున్న శేఖర్ కమ్ముల ఈ మూవీ విడుదల అయిన తరువాత నానీతో తీయబోయే మూవీ షూటింగ్ వైపు అడుగులు వేస్తాడాని టాక్. ఈమూవీలో నాని పక్కన సాయి పల్లవి హీరోగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి..