ఇప్పుడు మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హౌస్ లో యాక్టివ్గా ఉంటూ తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న ప్రేరణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
ప్రేరణకు ఒక బ్యాడ్ న్యూస్ అందబోతుందట. ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ కన్నుమూసారట. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ప్రేరణకు ఈ విషయం తెలిసే అవకాశం లేదు. కానీ ఇక బిగ్ బాస్ ప్రేరణకు ఈ విషయాన్ని చెప్పబోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే బిగ్బాస్ నిర్వాహకులు ఆమెను ఇంటికి పంపించే నిర్ణయం ఏమైనా తీసుకుంటారా.. లేదంటే హౌస్ లో ఉండి ప్రేరణ తన ఆటను కొనసాగిస్తుందా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవేళ ప్రేరణ ఇంటికి వెళ్లాలి అనుకుంటే మాత్రం ఇక ఆమెను ఇంటికి పంపించి మళ్ళీ హౌస్ లోకి తీసుకువచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేసే అవకాశం కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.