- ఇండస్ట్రీలో రచ్చ లేపిన టబు నాగార్జున వ్యవహారం..
- నిన్నే పెళ్ళాడుతా మూవీ నుంచి మొదలైన పరిచయం..
- నాగార్జున ఇంటి ముందే సొంత ఇల్లు కట్టుకున్న టబు..


 ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తన అందచందాలతో కుర్ర కారును మెస్మరైజ్ చేసిన హీరోయిన్ టబు. ఒకప్పుడు టబు చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ,తమిళ భాషల్లో కూడా అనేక చిత్రాలు చేసింది. అలాంటి టబు ఆ తరం హీరోలందరితో తెరను పంచుకుంది. అలాంటి ఈమె 53 సంవత్సరాల వయసులో కూడా పెళ్లికి దూరమై ఒంటరిగా గడుపుతోంది. అయితే టబు పెళ్లి చేసుకోకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉందట. అయితే ఈమె టాలీవుడ్ స్టార్ హీరో అయిన నాగార్జునతో ప్రేమ వల్లే పెళ్లికి దూరమైందని అనేక వార్తలు వినిపించాయి. నాగార్జున టబు ఎఫైర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 నాగ్ టబు ఎఫైర్:
 తప్సం ఫాతిమా హస్మి అలియాస్ టబు  1971 నవంబర్ 4వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్ ముస్లిం కుటుంబంలో పుట్టింది. టబు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడింది. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోవడంతో  ఇంటి బాధ్యత అంతా తన తల్లి చూసుకునేది. అయితే టబు తల్లికి బాలీవుడ్ తో మంచి సంబంధాలు ఉండడంవల్ల ఆమె ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. అయితే బాలనటిగా 1980లో బజార్ అనే చిత్రంలో టబు నటించింది. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే వెంకటేష్ హీరోగా కూలీ నెంబర్ వన్ చిత్రంలో బాలీవుడ్ నుంచి హీరోయిన్ కావాలని రామానాయుడు టబు ని తీసుకువచ్చారు. ఈ మూవీ 1987లో రిలీజ్ అయి అద్భుతమైన హిట్ సాధించింది. 1987 తర్వాత 1996లో నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో  ఆవిడే మా ఆవిడ, ప్రేమదేశం, అందరివాడు, చెన్నకేశవరెడ్డి,  పాండురంగడు అనే తెలుగు చిత్రాల్లో నటించింది. ఈమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ఇక టబు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..  ఈమె నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతా, ఆవిడే మా ఆవిడ  వంటి సినిమాల్లో చేసే సమయంలో నాగార్జునతో లవ్ లో పడింది. ఇలా వీరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.


దీంతో టబు అమలకు ఎలాగైనా విడాకులు ఇవ్వాలని నాగార్జునతో చెప్పిందట. వీరి ప్రేమ వ్యవహారం అర్థం చేసుకున్న అమల  మీరు ఎలాగైనా ఉండండి కానీ నేను నాగార్జునకు అస్సలు విడాకులు ఇవ్వలేను అని చెప్పిందట. అలా టబు నాగార్జున ఫ్రెండ్స్ గానే ఉంటూ చాలా క్లోజ్ గా ఉండేవారట.  చివరికి అమల టబు కి వారి ఇంటి ముందే ఒక ఫ్లాట్ తీసుకొని ఇల్లు కూడా దగ్గరుండి కట్టించిందట.  అలా అమల కూడా టబుతో చాలా క్లోజ్ గా ఉంటూ టబుతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారట. ఈ విధంగా టబు నాగార్జున వ్యవహారం పెళ్లి వరకు కూడా వెళ్లిందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ దీనిపై స్పందించిన నాగార్జున మా మధ్య మంచి స్నేహం ఉందని, అది అమలకు కూడా తెలుసు అని  చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.ఇక నాగార్జున ఫ్రెండ్షిప్ అని చెప్పినప్పటికీ మీడియాలో మాత్రం మరోరకంగా వినిపిస్తోంది. అలా టబు 50 ఏళ్ల వయసు పై పడినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది. ఇక టాలీవుడ్ లో టబు పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున  పేరు వినిపిస్తే బాలీవుడ్లో అజయ్ దేవగన్ పేరు వినిపిస్తుంది. గతంలో అంటే నాగార్జున కంటే ముందే అజయ్ దేవగన్ తో టబు ప్రేమలో ఉందట. కానీ అజయ్ దేవగన్ టబుని పక్కనపెట్టి కాజోల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా అటు అజయ్ దేవగన్, ఇటు నాగార్జున ఇద్దరితో ప్రేమలో విఫలమైన టబు కి ప్రేమ,పెళ్లి,రిలేషన్ పై నమ్మకం పోయి పెళ్లికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: