టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వివాదం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై ఇటీవల ఆయన అసిస్టెంట్, లేడీ డాన్సర్ లైంగిక ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా దాడి చేశాడు అంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే జానీ మాస్టర్ నార్సింగి  పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో ఈ కేసును రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.


 అయితే కేవలం జానీ మాస్టర్ మాత్రమే కాకుండా అతని భార్య కూడా తనను తీవ్రంగా వేధించింది అంటూ లేడీ డాన్సర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిపోయాయి. అయితే తనపై ఎవరో కావాలని కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఒకవేళ ఆధారాలు ఉంటే తనకు ఏ శిక్ష వేసినా సమ్మతమే అంటూ ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో  జానీ మాస్టర్ కు వరుస షాకులు తగులుతున్నాయ్. ఇప్పటికే జనసేన పార్టీ తమ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అంటూ ఆదేశించింది.


 ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం జానీ డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అధ్యక్ష పదవితో పాటు అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది అంటూ అటు తెలుగు ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: