యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నాడు. ఇక విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇక ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
అయితే పబ్లిక్ ఈవెంట్ నిర్వహించాలని.. ముందుగా దేవర టీం అనుకున్నారు. కానీ భద్రతా పరమైన సమస్యలు వస్తాయని.. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో చివరికి కాంప్రమైజ్ అయ్యారు. హోటల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారట. సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఈవెంట్ నీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ ఈ ప్రోగ్రాం ఉండే ఛాన్స్ ఉంది. అయితే అటు తారక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ఎవరిని ఆహ్వానించబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ అన్నది తెలుస్తుంది.