కృష్ణంరాజు వారసుడిగా చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపును సంపాదించుకున్నాడు. కాగా ప్రభాస్ అనుష్క జంట మొదటిసారి బిల్లా అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా ఒకే రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. ఎంత స్టార్స్ అయినప్పటికీ సింపుల్ గా ఉండడం వీరిద్దరికి ఇష్టం. ఇక ఇదే వీరిద్దరి మధ్య సాదాసీదా ఉన్న పరిచయాన్ని స్నేహంగా మార్చేసింది.
ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. ఇక ఈ సినిమాలో బావ మరదళ్లుగా నటించిన అనుష్క, ప్రభాస్ జీవించేసారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే పుకారు తెర మీదికి వచ్చింది. అయితే బయట కూడా వీరిద్దరూ ఎన్నో చోట్ల కలిసి కనిపించడంతో అనుష్క, ప్రభాస్ లవ్లో కొనసాగుతున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. తమ మధ్య ఏమీ లేదని కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పిన.. అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎన్నో కలలు కన్నారు.. ఇప్పటికీ కూడా వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు తెరమీదకి వస్తూ ఉంటాయి. అయితే వీరిద్దరి మధ్య లవ్ నిజమో కాదో కానీ.. వీరిది మాత్రం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని అభిమానులు బలంగా నమ్ముతూ ఉంటారు.