ఎట్టకేలకు ప్రేమ పక్షులు సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీల పెళ్లి జరిగిపోయింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. తెలుగులో బాయ్స్ నుంచి మొదలు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులకు ఇష్టమైన హీరోగా మారిపోయాడు. తర్వాత కొన్ని ఫ్లాప్‌‌లు వచ్చినా ఇటీవలే తిరిగి ఆయన ఫామ్‌లోకి వచ్చారు. మరో వైపు అందాల తార అదితీ రావ్ హైదరీ ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టింది.

 తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం 9000 కేఎంపీహెచ్, వి, మహాసముద్రం సినిమాల్లో నటించింది. ఇక మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్‌కు జోడీగా ఆమె నటించిన సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పలు సినిమా ఫంక్షన్లలోనూ కలిసే జంటగా కనిపించారు. ఇప్పటికే వీరిద్దరికీ గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం అయింది. తర్వాత ఇద్దరికీ విడాకులు అయ్యాయి. ఇక ప్రేమలో పడిన ఈ జంట 400ల ఏళ్ల చరిత్ర ఉన్న రంగనాథ స్వామి ఆలయంలో సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. దీంతో ఆ ఆలయం గురించి అంతా ఆసక్తిగా తెలుసుకో సాగారు.

అదితీ రావ్ హైదరీ పూర్వీకులది రాజవంశం. వారికి తెలంగాణలోని వనపర్తి సంస్థానంతో విడదీయరాని అనుబంధం ఉంది. శ్రీరంగాపూర్‌లోని 400 ఏళ్ల నాటి శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని రాయల కాలంలో నిర్మించారు. ఈ ఆలయంలోనే వీరి ఇంటికి సంబంధించిన శుభకార్యాలు జరుగుతాయి. ఇక ఆమె తండ్రి పేరు ఎసహాన్ హైదరీ. తల్లి పేరు విద్యారావు. ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ ప్రధానిగా పని చేసిన అక్బర్ హైదరీ మనవడే ఎసహాన్ హైదరీ. ఇక విద్యారావు వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె.


ఇక ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఏ శుభకార్యమైనా  శ్రీ రంగనాయక స్వామి ఆలయంలోనే నిర్వహిస్తారు. వారి కుటుంబ సభ్యులతో పాటు తరతరాలుగా ఇది వంశపారంపర్యంగా వస్తోంది. దీంతో అదితీరావ్ హైదరీ-సిద్ధార్థ్ పెళ్లి సైతం ఇక్కడే నిర్వహించారు. ఇక ఈ కొత్త జంట పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం హాజరై ఆశీర్వదించారు. వీరు తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: