ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. సెప్టెంబరు 27న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో ఎన్టీఆర్ లుక్, యాక్షన్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్కు తెగ నచ్చేశాయి. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ చేసారు.పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్న ఈ మూవీ కోసం ఇండియా వైడ్ ఎన్టీఆర్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో దేవర టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ముంబై, ఇటు తమిళ నాడులో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే అన్ని లాంగ్వేజెస్‌లో చిత్ర బృందం ఏదో ఒక రకంగా మూవీ ప్రమోషన్ చేస్తూనే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు మాత్రం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ మూవీ ఈవెంట్ కర్నూల్‌లో జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

దేవర టీమ్ ప్రస్తుతం చెన్నైలో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. రెండు రోజులు ప్రమోషన్స్ ఇక్కడే చేస్తున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో స్టేజ్ పై యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాకు చెయ్యాలానేవుంది. నేను రెడీగానే ఉన్నాను. నా ఫేవరెట్ తమిళ్ డైరెక్టర్ ఓకే అంటే అప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ తమిళ్ మూవీ చేస్తా అన్నాడు. దానికి ఆ యాంకరమ్మ.. మీ ఫేవరెట్ తమిళ్ డైరెక్టర్ ఎవరూ అంటే.. ఇంకెవరూ వెట్రి మారన్.. అయన నాతో సినిమా చెయ్యాలని కోరుకుంటున్నా అని స్టేజ్ మీదే ఎన్టీఆర్ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చెయ్యడం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.. తన ఫేవరెట్ డైరెక్టర్ ను అలా వేదిక మీదే సినిమా చేయమని అడగడం అక్కడి ఆడియన్స్ కు నచ్చిందేమో కానీ మనవాళ్లు ఫీలవుతున్నారు.. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: