గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరద్దరు దేవర కోసం జతకట్టారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ రికార్డ్ వ్యూస్ రాబడుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో ఎన్టీఆర్ లుక్, యాక్షన్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్కు తెగ నచ్చేశాయి. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ చేసారు.అయితే ఎన్టీఆర్ సోలో కథానాయకుడిగా నటించిన సినిమా కాబట్టి దేవరను తన కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అంటూ తారక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజమే... ఆర్.ఆర్.ఆర్ లో చరణ్‌తో కలిసి నటించాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లీడ్ పాత్రలో దేవర1 మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించాడు. పైగా పాన్ ఇండియా మార్కెట్ ని ఛేజిక్కించుకోవాలన్న తపన కూడా ఎన్టీఆర్ లో కనిపిస్తోంది. అందుకే ఇలా మెట్రోలన్నీ తిరిగి తారక్ ప్రచారం చేస్తున్నారన్నమాట.ఇదిలావుండగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ''చెన్నై నాకెంతో ప్రత్యేకం.అలాగే తాము టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్, సాండల్ వుడ్ ఇలా వేర్వేరు భాషల్లో నటిస్తున్నా అందరిని ఏకం చేసేది ఎప్పటికీ సినిమానే అని ఎన్టీఆర్ చెప్పారు. బాక్సాఫీస్ వద్ద సినిమా సత్తా చాటితే భాష సరిహద్దులు చెరిగిపోతాయన్నారు. తెలుగు సినిమాకు చెన్నై సోపానం వంటిదని పేర్కొన్నారు. మరోవైపు అనిరుధ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా చేయాలని ట్రెండ్ చేసినప్పుడే తమ కాంబినేషన్ కుదిరిందని తెలిపారు.ఇదిలావుండగా పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. అర్ధరాత్రి షో నిర్వహించడం వల్ల వసూళ్లకు భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: