గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది అని ప్రేక్షకులు ఆనందపడ్డారు. కానీ ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నటించిన ఏ చిత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. ఆయన ప్రస్తుతం సీనియర్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'గేమ్ చేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై డీల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 ఇప్పటివరకు ఈ మూవీ నుంచి ఒక్క లిరికల్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈచ్ చిత్రం విడుదల ఎప్పుడు అనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కథ కొద్ది రోజులుగా ఈ చిత్రాన్ని డిసెంబరులో క్రిస్మస్ పర్వదినాన విడుదల చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించనా ఆ డేట్ కు రావడం కష్టమనే అంటున్నాయి సినీ వర్గాలు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి మరో పాట విడుదల చేశామని ప్రకటించారు.

 అయితే ఆ పాటను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. శంకర్ నుంచి ఇంకా పాటకు సంబంధించిన ఫైనల్ ఆప్రూవర్ రాలేదని తెలిసింది. నిర్మాత ప్రకటించినట్లుగా డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తారని రామ్ చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే విశ్వాసనీయ సమాచారం ప్రకారం డిసెంబరులో గేమ్ చేంజర్ ను విడుదల చేసే అవకాశం లేదని, మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ వార్తని ఎటింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: