హనుమాన్ చిత్రంలో పాన్ ఇండియా దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. సుధాకర్ చెరుకూరితో పాటు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ మూవీని నిర్మిస్తోంది. దసరాకు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రం దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. విజువల్ గా గ్రాండియర్ గా ఉండటంతో పాటు సంకేతికంగా కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ప్రాధాన్యత ఉందని తెలిసింది.
అందుకే చిత్ర బడ్జెట్ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతో కేర్ తీసుకుంటున్నారని తెలిసింది. నందమూరి బాలకృష్ణ ఎంతో నమ్మకంతో తన వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తన మీద ఉంచారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ను పెడతానని ప్రశాంత్ వర్మ చెబుతున్నారు. ఇక మోక్షజ్ఞ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించలేదు. మరి ఈ సినిమా మొదటి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా ప్రారంభం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.