యంగ్ బ్యూటీ శ్రీలీల  మొట్టమొదటిగా 'పెళ్లి సందడి' అనే మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలకృష్ణ సరసన భగవాన్ కేసరి మూవీలో కూతురి క్యారెక్టర్ లో చేసింది ఈ అమ్మడు. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ప్రతి హీరో సరసను కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. మొదటి మూవీ నే హిట్ కావటంతో బ్యూటీ క్రీజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో వరుస ప్రాజెక్ట్ లు చేస్తూ సందడి చేసింది. అయితే...'


పెళ్లి సందడి' తర్వాత శ్రీలీల నటించిన పలు సినిమాలు వరుస డిజాస్టర్ కావటంతో... ఆమె గ్రాఫ్ కూడా మెళ్లి మెళ్లి గా తగ్గుతూ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో స్త్రీ లీలాపై నెగెటివిటి కూడా పెరిగింది. ఈ క్రమంలోనే మూవీ ఆఫర్స్ లేక యాడ్స్ చేసుకుంటుందని పలువురు విమర్శించారు. కానీ వాటన్నిటికీ ఏమాత్రం రియాక్ట్ అవ్వని శ్రీలీల కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' లో నటిస్తున్న ఈ బ్యూటీ... ఇటీవల రవితేజ తో మరో చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ తో పాటు... మరోవైపు కోలీవుడ్,

కన్నడ ఇండస్ట్రీల పై కూడా శ్రీలీల ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ యంగ్ బ్యూటీ ఓ బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో స్క్రీన్ చేసుకోబోతుందట శ్రీలీల. అజిత్ నటిస్తున్న రెండు సినిమాలు 'విడాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లి' లు ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాల్లో ఓ సినిమాలోకి హీరోయిన్ గా శ్రీలీలను అడిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకు శ్రీలీల కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే... దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానప్పటికీ ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో... తమిళంలో శ్రీలీల మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుందా అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: