కొంత మంది హీరోల సినిమాలకు హిట్టు ఫ్లాపు టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా వందల కోట్ల కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అలాంటి హీరోలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడుతుంటారు. అలాగే అంత క్రేజ్ ఉన్న హీరోతో సినిమాలు నిర్మించినట్లు అయితే సినిమా కాస్త తేడా కొట్టినా కూడా వారికి మంచి స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. దానితోనే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించేందుకు ఎక్కువ శాతం నిర్మాతలు ముందుకు వస్తూ ఉంటారు. అంత క్రేజ్ ఉన్న హీరోలు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ లను కూడా పుచ్చుకుంటూ ఉంటారు.

ఇక ఇండియాలో అనే అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకునే ఇద్దరు హీరోలు ఎవరో తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సిరీస్ మూవీ లతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈయన నటించిన సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా వందల కోట్లలో కలెక్షన్స్ వస్తున్నాయి. దానితో ఎంత ఇచ్చైనా సరే ప్రభాస్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. తలపతి విజయ్ కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈయన కొంత కాలం క్రితం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం ఈయన 200 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈయన హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 275 కోట్ల వరకు ఈయన రెమ్యూనిరేషన్ పుచ్చుకొని ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ ఇద్దరు సౌత్ హీరోలు ఇండియాలోనే అత్యంత భారీ పారితోషకం తీసుకుంటున్న నటులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: