టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్టార్ దర్శకుడిగా చాలా సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించిన కే రాఘవేందర్రావు ఎంతో మంది హీరోలకు ఎన్నో విజయాలను అందించాడు. అలా ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన రాఘవేంద్రరావు , బాలయ్యతో ఏడు సినిమాలను తెరకెక్కించగా అందులో ఏ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోలేదు. మరి బాలయ్య , రాఘవేంద్రరావు కాంబోలో రూపొందిన ఏడు సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

రాఘవేంద్రరావు , బాలకృష్ణ కాంబోలో మొదటగా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ కూడా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో పట్టాభిషేకం అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో మూడవ సినిమాగా అపూర్వ సహోదరులు అనే మూవీ రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో నాలుగవ సినిమాగా సాహస సామ్రాట్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

బాలయ్య , రాఘవేందర్రావు కాంబినేషన్లో 5 వ సినిమాగా దొంగ రాముడు మూవీ వచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఆరవ సినిమాగా అశ్వమేధం అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఏడవ చిత్రంగా పాండురంగడు మూవీ వచ్చింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

ఇలా బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఏడు సినిమాలు రాగ అందులో ఏ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: