టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి కొరటాల శివ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా దేవర సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఇకపోతే సరికొత్తగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రచారాలను చేస్తున్నారు. 

అందులో భాగంగా ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ తో ఈ మూవీ బృందం తాజాగా ఓ ఇంటర్వ్యూ ను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూ లో ఈ సినిమాకు దర్శకుడిగా పని చేసిన కొరటాల శివ , సంగీతం అందించిన అనిరుద్ రవిచంద్రన్ , ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేసిన రత్నవేలు , ఈ మూవీ కి లిరిక్స్ అందించిన రామ జోగయ్య శాస్త్రి , సబ్ సైరల్ ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. 

ఇలా ఈ సినిమాకు పని చేసిన టాప్ టెక్నీషియన్స్ అంతా కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ షూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరో ఒకటి , రెండు రోజుల్లో ఇంటర్వ్యూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యొక్క మొదటి భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో బారి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా మొదటి భాగం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: