ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలు చాలా వరకు పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు అంటే తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అవుతూ ఉంటాయి. దానితో పని అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా పని అనేది ఎక్కువ అవుతూ ఉండడం వల్ల గతంలో స్టార్ హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటి వచ్చేవి కాస్త ఈ మధ్య కాలంలో రెండు , మూడు సంవత్సరాలకు ఒకటి వస్తూ ఉన్నాయి.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక పాన్ ఇండియా సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కానీ అందులో పుష్ప 2 మూవీ ని మినహాయిస్తే మరే సినిమా కూడా ఏ తేదీన వస్తుందో సరిగ్గా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. పుష్ప 2 మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజెర్ సినిమాలో హీరోగా నటించాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన ఈ సినిమా ఎంత వరకు ఆ నెలలో విడుదల అవుతుంది అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఇక పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు , ఓజి సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా రూపొందుతున్నాయి. ఈ మూవీల విడుదల తేదీల గురించి మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్న అవి ఆ తేదీన రావడం చాలా కష్టంగా కనబడుతుంది. ఈ లెక్కను చూసినట్లయితే కేవలం పుష్ప 2 మాత్రమే చెప్పిన తేదీకి విడుదల అయ్యే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. మరి మిగతా సినిమాలు కూడా చెప్పిన తేదీలకు విడుదల అవుతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: