నందమూరి బాలయ్య వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వరుస హిట్లతో జోష్ మీద ఉన్న నందమూరి నటసింహం మళ్లీ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.బాబీ గత ఏడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్టను అందుకున్నాడు. ఇప్పుడు బాలయ్యతో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శకుడు బాబీ ఈ సినిమాను సైలెంటుగా తెరకెక్కించేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుందనే విషయం కూడా బయటకు రాకుండా మ్యానేజ్ చేస్తున్నారు మేకర్స్. త్వరగా సినిమాని కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారని సమాచారం.బాలయ్య గానీ... దర్శకుడుగానీ.. చిత్ర యూనిట్ కానీ... ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే.. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది. 

అంతేకాదు ఈ మూవీ రిలీజ్‌ డేట్ విషయంలోనూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. NBK109 సినిమాను సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలను మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. మొదట ఈ సినిమాను దసరాకి రిలీజ్‌ చేయాలనుకున్నారట. కానీ అంతకంటే ముందే షూటింగ్‌ పూర్తవుతున్న నేపథ్యంలో విడుదల ముందుగానే చేయాలనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలోనే NBK109 సినిమాను వేసవిలో అనగా మేలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అందులో త్రిష, ప్రియమణి, ఊర్వతి రౌతేలా.. ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందట. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి బాలయ్య లుక్ రిలీజ్ అయింది. తాజాగా షూటింగ్‌ సెట్‌ నుంచి బాలయ్య లుక్‌ బయటకు లీక్ అయింది. ఇందులో యంగ్‌ కుర్రాడిలా కనిపిస్తున్నాడు.యన్ బి కే 109సినిమా షూటింగ్ స్పాట్ కి "పైలం పిలగా"చిత్ర యూనిట్ వెళ్లింది. ఈ నెల 20వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ కోసం ట్రైలర్ ను బాలయ్య కు చూపించారు. ఈ సందర్బంగా పంచెకట్టు లో హ్యాండ్సమ్ గా బాలయ్య కనిపించారు. బాలయ్య రోజు రోజుకు యూత్ గా మారుతున్నారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: