డాన్స్ కొరియోగ్రాఫర్ గా , నటుడిగా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఈయన డాన్స్ కొరియోగ్రాఫర్ గా అద్భుతమైన స్థాయికి ఎదిగిన తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. అలా నటుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను సంపాదించుకున్న తర్వాత ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలు పెట్టాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ చేయడం , దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు.

అందులో భాగంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ పర్వాలేదు అనే స్థాయి ఈమేజ్ ను సంపాదించుకున్న వారిలో రమేష్ వర్మ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా తమిళ్ లో విజయం సాధించిన రాక్షసన్ మూవీ ని తెలుగు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. రమేష్ వర్మ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ హీరోగా రూపొందిన వీర , కిలాడి సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ఇకపోతే రమేష్ వర్మ తన తదుపరి మూవీ ని రాఘవ లారెన్స్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కొంత కాలం క్రితం హిందీ లో కిల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు , తమిళ భాషల్లో రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ రీమిక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు బిగ్ యాక్షన్ అడ్వెంచర్ బిగిన్స్ అని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ రీమిక్ సినిమా తెలుగు , తమిళ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: