శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 27 వ తేదీన గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దేవర సినిమా రిలీజ్ కి ముందే సంచనాలు సృష్టిస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యూకే లో డాల్బీ అట్మాస్ లో స్క్రీనింగ్ ఉందని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 26వ తేదీన యూకే లో ప్రీమియర్ షోలు ఉంటాయని తెలిపాయి.
ఈ విషయం కాస్త జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెవిన పడటంతో తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ కూడా పాల్గొననుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీకి మొదటి సినిమా కావడంతో జాన్వీ అభిమానులంతా సెప్టెంబరు 27 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దేవర బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, rrr తర్వాత గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ  దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి అఖండ విజయం సాధించింది. దీంతో దేవర ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇదే సందర్బంగా సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచడం తో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని అభిమానులు, సినీ లవర్స్ , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచుతూ సినిమా తాలూకా విశేషాలను తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలు తెలియజేయగా..తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా UKలో ‘డాల్బీ అట్మాస్’లో స్క్రీనింగ్ అవనుందని మేకర్స్ ప్రకటించి మరింత ఆనందం నింపారు. అలాగే రేపు ఈ మూవీ లోని ఆయుధ పూజా అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.ఇదిలావుండగా దేవర ఓవర్సీస్ బుకింగ్స్ లోను సంచనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: