నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అలాగే ఎంతో మంది దర్శకులు బాలయ్య కు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందించారు. కానీ ఓ ఇద్దరు దర్శకులు మాత్రం బాలకృష్ణ కు అదిరిపోయే రేంజ్ విజయాలను అందించారు. వారెవరో కాదు బి.గోపాల్ , బోయపాటి శ్రీను. బాలయ్య , బి గోపాల్ కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. అందులో మొదటగా లారీ డ్రైవర్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్ అనే మూవీ వచ్చింది.

సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సమరసింహా రెడ్డి అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో నరసింహ నాయుడు అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో పల్నాటి బ్రహ్మనాయుడు అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదటగా సింహ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత వీరి కాంబో లో లెజెండ్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. కొంత కాలం వీరి కాంబో లో అఖండ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి కొంత కాలం లోనే వీరి కాంబో లో అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ కూడా రాబోతుంది. ఇలా బి గోపాల్ , బోయపాటి శ్రీను ఇద్దరు కూడా బాలయ్య కు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: