గతంలో ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీలు ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు.. కానీ ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీలలో కూడా గెస్ట్ రోల్ పాత్రలు వైరల్ గా మారుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాగార్జున అయితే ఇతర భాషలలో సినిమాలో నటించకుండా కేవలం తెలుగులోనే నటిస్తూ ఉన్నారు. అలాగే పలు రకాల స్పెషల్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధమయ్యారు. అలా బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పుడు తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిస్తున్న కుబేర చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు.


అలాగే రజినీకాంత్ నటించిన కూలీ సినిమా నుంచి సైమన్ అనే పాత్రలో నటిస్తూ ఉన్నారు నాగార్జున. ఈ చిత్రంలో కూడా నాగార్జున ఒక డాన్ తరహా పాత్రలో కనిపించబోతున్నారని ఇటీవలె ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఒక లీకైన వీడియోని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. నాగార్జున డైలాగ్ చెబుతూ ఉండగా ఎవరో షూటింగ్స్ స్పాట్ నుంచి ఈ వీడియోని సైతం లిక్ చేసినట్లుగా కనిపిస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని తర్కెక్కిస్తున్నారు.


నాగార్జున ఈ లీక్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నది. ఇందులోని సీన్ తాలూకా సెటప్ అంతా కూడా భారీగానే వేసినట్టు కనిపిస్తోంది.. నాగార్జున వేసిన గెటప్పు చూస్తే కాస్త వైలెంట్ గా నెగిటివ్ గా కూడా కనిపిస్తోంది. అయితే నాగార్జున మాత్రం ఇందులో చాలా స్టైలిష్ గానే కనిపిస్తున్నారు. కూలి చిత్రంలోనే కాకుండా నాగార్జున ఉపేంద్ర తెరకెక్కిస్తున్న నటిస్తున్న U చిత్రంలో కూడా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారట. చివరిగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో సినిమా తెరకెక్కించిన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో నిరాశ చెందారు. అందుకే ఈసారి విభిన్నమైన కథాంశంతో కూలీ అనే టైటిల్ తో రజినీకాంత్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా  వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: