తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో అనుకున్నంత స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. తనకు యాక్సిడెంట్ అవడంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు గతంలో చెప్పుకొచ్చింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నానని, అదే సమయంలో కరోనా రావడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయాను అంటూ తెలియజేసింది. కొన్నాళ్ల గ్యాప్ అనంతరం ఇప్పుడు ఇప్పుడే తిరిగి సినిమాలు చేస్తుంది.
అంతేకాకుండా కొన్ని నెలలుగా సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది వరుస ఫోటోషుట్లు చూస్తూ తన అభిమానులని ఆకట్టుకుంటుంది. మాస్ మహారాజ్ రవితేజతో కలిసి డిస్కో రాజా సినిమా చేసింది. కానీ ఈ సినిమా తన కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు. అనంతరం సాయి ధరమ్ తేజ్ తో కలిసి సోలో బ్రతుకే సో బెటరు, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించిన అవేమి పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్లు చేస్తోంది.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా... తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నబా నటేష్ టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో ఉందట. అంతేకాకుండా ఆ హీరోతో ఎఫైర్ నడుపుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఆ హీరోని వివాహం చేసుకుంటుందా.... లేకపోతే సినిమా అవకాశాల కోసం ఇలా చేస్తుందా అని కొంతమంది అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ బ్యూటీ నోరు విప్పితే కానీ అసలు విషయం తెలియదు.