చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అడపాదడపా సినిమాలలో నటించి సినిమాలకు దూరమై గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ న్ కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో బాగానే ఆకట్టుకుంది. తమిళంలో రెండు సినిమాలలో నటించిన ఏమే తెలుగులో ఆ సినిమాలను డబ్బింగ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ హీరోయిన్ తల్లి, అక్క కూడా హీరోయిన్.


ఎవరో కాదు 1990 దశకంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన హీరోయిన్ రాధ రెండవ కుమార్తె ఈ ఫోటోలో కనిపించే హీరోయిన్.. మొదట కుమార్తె కార్తిక కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే రంగం సినిమాలో హీరోయిన్గా నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె మొదట నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు తేరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు తులసి నాయర్.. ఈమె రాధిక రెండవ కుమార్తె కార్తీకాకు చెల్లెలు అవుతుంది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కార్తీకాకు తన చెల్లెలికి ఇద్దరికీ అదృష్టం కలిసి రాలేదు.


తులసి నాయర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో తన నటనతో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత 2014లో యాన్ అనే చిత్రంలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది తులసి నాయర్. ఇటీవలే తన అక్క కార్తిక పెళ్లిలో తులసి నాయర్ ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అక్క కార్తిక చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఉండగా చెల్లెలు తులసి నాయర్ మాత్రం గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగిపోయి చాలా బొద్దుగా మారిపోయింది. అసలు ఈమె రాధిక రెండవ కుమార్తె కడలి హీరోయిన్ అంటే ఎవరు నమ్మేలా లేదంటే కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: