టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇక తాజా ఇంటర్వ్యూ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తనకు నచ్చిన దర్శకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... వెట్రీ మారన్ సార్ నా అభిమాన దర్శకుడు. మరియు ఆయన దర్శకత్వానికి నేను పెద్ద అభిమానిని.

ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలలో వడ చెన్నై సినిమా నాకు చాలా ఇష్టమైన మూవీ. ఆయన సినిమాలు , కథనాలను అనుసరించే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయనతో ఓ ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నాం. నాకు ప్రస్తుతం కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆయనకు కూడా ప్రస్తుతానికి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రకృతి నన్ను , వెట్రి మోరన్ ను త్వరలోనే కనెక్ట్ చేస్తుంది అని నేను నమ్ముతున్నాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , వేట్రీ మారన్ గురించి చెప్పిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే దేవర సినిమాలో ఝాన్సీ కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో బారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ప్రచారాలను చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: