ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, యావత్ భారతదేశం అంతట, సినిమా పరిశ్రమలకు సంబంధించి క్యాస్టింగ్ కౌచ్ గురించే ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు, మలయాళ పరిశ్రమను కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ అంశం... ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఇబ్బందుల్లో పెట్టినట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. అసలు విషయంలోకి వెళితే, గత కొద్ది రోజులుగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ని గురించిన వార్తలే మీడియాలో సర్కిల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ తన తోటి లేడీ మాస్టర్ తో లైంగిక పరమైన చర్యలకు పాల్పడి, ఆమెని మానసికంగా... శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాస్టర్ పై పోలీసు కేసు కూడా నమోదు కాబడింది. ఇక కొద్దిసేపటి వరకు పరారీలో ఉన్న మాస్టర్ తాజాగా పోలీసులు చేతికి చిక్కినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణల విషయంలో తెలుగు సినిమా ప్రముఖులు కూడా తమ గలాన్ని విప్పుతున్నారు. ఈ క్రమంలోనూ ప్రముఖ కమెడియన్ ఆలీ, డాన్స్ మాస్టర్ జానీ విషయంలో సంచలన ఆరోపణలు చేయడంతో ఒకసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది.

ఇక ఆలీ ఏమన్నారంటే? చిత్ర పరిశ్రమ అనేది చాలా అందమైనది. ఇక్కడకి తమ కలలను సహకారం చేసుకోవడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. అందులో ఆడవాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు... కానీ, అవకాశాల పేరిట వారిని లైంగిక పరంగా ఇబ్బందులకు గురి చేయడం మహా ఘోరం. ఇటువంటి తప్పులు ఎవరు చేసినా ఉపేక్షించవద్దు. ఏ స్థాయినటులైనా, మరే స్థాయి టెక్నీషియన్లు అయినా... విడిచి పెట్టవద్దు! పోలీసులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఇకనైనా చెక్ పెట్టాలని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా ఆలీ పలికిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారాన్నే సృష్టిస్తున్నాయి. మరోవైపు ఈ మాటలను ఓ వర్గం వారు ట్యాగ్ చేస్తూ... మరో వర్గం వారికి టార్గెట్ చేస్తున్నారు. రాను రాను డాన్స్ మాస్టర్ జానీ విషయం రాజకీయం కాబోతోందని ఇట్టే అర్థం అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: