సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉండదు. దానితో క్రేజ్ ఉన్నప్పుడే రెండు చేతులతో డబ్బులు సంపాదించడానికి ఎక్కువ శాతం హీరోయిన్లు ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగా కొంత మంది సినిమాలు చేస్తున్న సమయం లోనే ఇతర బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం , షాప్ ఓపెనింగ్ లకి ముఖ్య అతిథులుగా వెళ్లి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఉంటారు. మరి కొంత మంది సినిమాలు చేస్తూ , షాప్ ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా అనేక బిజినెస్ ల ద్వారా కూడా డబ్బును సంపాదిస్తూ ఉంటారు.

ఇలా సినిమాల్లో నటిస్తూనే వివిధ రకాల బిజినెస్ ల ద్వారా డబ్బును పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న వారు అనేక మంది మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఓ వైపు స్టార్ హీరోయిన్గా కొనసాగిస్తూనే మరో వైపు బిజినెస్ ల ద్వారా కూడా డబ్బులు పెద్ద మొత్తంలోనే సంపాదిస్తుంది. ఈమె ఇప్పటికే అనేక జిమ్ సెంటర్ లను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరీర్ నీ కొనసాగించిన కాజల్ అగర్వాల్ సినిమాల్లో అద్భుతమైన జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న సమయం లోనే అనేక షాప్ ఓపెనింగ్స్ కు వెళ్లి భారీ మొత్తంలో డబ్బులను కూడా సంపాదించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే మరి కొంత మంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా కొన్ని బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇలా కేవలం రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ మాత్రమే కాకుండా రెండు చేతులతో డబ్బులు సంపాదిస్తున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: