యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించాడు . ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నాడు . అందులో భాగంగా తాజాగా తమిళ్లో ఈయన చాలా యాక్టివ్ గా ప్రచారాలను నిర్వహిస్తు న్నాడు . అందులో భాగంగా తమిళ్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి అట్లీ తో తాను ఓ సినిమా చేయనున్నట్లు చెప్పాడు. అసలు విషయంలోకి వెళితే ... అట్లీతో గత కొంత కాలంగా ఓ మూవీ గురించి చర్చలు జరుపుతున్నట్లు , అందులో భాగంగా ఆయన ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీని తనకు చెప్పినట్లు , ప్రస్తుతం ఆ స్టోరీ గురించి మేమిద్దరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అన్ని కుదిరితే మరి కొంత కాలంలోనే ఆ స్టోరీ తో మేమిద్దరం కలిసి సినిమా చేయనున్నట్లు ఎన్టీఆర్ చెప్పాడు.

అలాగే అట్లీ అద్భుతమైన ప్రతిభావంతమైన దర్శకుడు. ఆయనతో సినిమా చేయడం కోసం నేను ఎంతో వెయిట్ చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. అలాగే లోకేష్ కనకరాజు కూడా సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అని  , విక్రమ్ మూవీ ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దాడు అని కూడా ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. అలాగే జైలర్ మూవీ కూడా అద్భుతమైన సినిమా అని ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇలా  తాజా ఇంటర్వ్యు లో ఈ నటుడు అనేక ఆసక్తి కరమైన విషయాలను తెలియజేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: