టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎన్నో మూవీలు బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి. ఇకపోతే గోపాల్ ఓకే బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలను రూపొందించగా అందులో ఏకంగా మూడు మూవీలు ఇంట్రెస్ట్ హిట్లుగా కూడా నిలిచాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

గోపాల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలను రూపొందించాడు. అందులో మూడు మూవీలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. మొదటగా బి గోపాల్  బాలయ్య హీరోగా సమరసింహా రెడ్డి అనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ హీరోగా బి గోపాల్ "నరసింహ నాయుడు" అనే మరో ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే బి గోపాల్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇంద్ర అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. 

మూవీ లో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గోపాల్ ఇలా సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు , ఇంద్ర ఈ మూడు సినిమాలను ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలుగా రూపొందించి మూడు సినిమాలతో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: