తమిళ నటుడు కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకుని కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నటుడు నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈయన నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

తాజాగా ఈ నటుడు సత్యం సుందరం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీని సెప్టెంబర్ 28వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సినిమా బృందం వారు పెద్దగా ప్రచారాలను చేయడం లేదు. ఈ మూవీ కంటే ఒక రోజు ముందు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగం విడుదల కానుంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న అద్భుతమైన స్థాయిలో ప్రచారాలను ఇండియా వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దానితో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల మరింతగా పెరుగుతున్నాయి. దానితో భారీ అంచనాలు ఉన్న సినిమాకు పోటీగా సత్యం సుందరం ను మేకర్స్ దించుతున్న ప్రచారాలు చేయకపోవడంతో కార్తీ అనవసరంగా ఈ సినిమాతో రిస్క్ చేస్తున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే సత్యం సుందరం సినిమా తెలుగులో దేవర మూవీ తో పోటీ పడి పెద్ద స్థాయి విజయాన్ని సాధించడం కష్టమే. కానీ తమిళ సినీ పరిశ్రమలో ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: